ఫిఫా: ఉత్కంఠ పోరులో సౌదీ విజయం

ఫిఫా: ఉత్కంఠ పోరులో సౌదీ విజయం

ఫిపా వరల్డ్‌క్‌పను సౌదీ అరేబియా విజయంతో ముగించింది. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో భాగంగా ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో వీక్టరీ నమోదు చేసింది. మ్యాచ్‌ 22వ నిమిషంలో మో సలా తొలిగోల్‌ చేసి ఈజిప్ట్‌కు ఆధిక్యం అందించాడు. ఫస్ట్‌ హాఫ్‌ ఇంజ్యూరీ సమయం (45+6)లో సౌదీ మిడ్‌ఫీల్డర్‌ అల్‌ ఫరాజ్‌ గోల్‌ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్ల డిఫెండర్లు అద్భుతంగా ఆడారు. సౌదీ డిఫెండర్‌ సలేం అల్‌ దాస్రి ఆట అదనపు సమయంలో అద్భుతమైన గోల్‌ చేసి ఈ వరల్డ్‌కప్‌లో జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఇక.. ఇరుజట్లు తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడడంతో ఇంతకుముందే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.