సౌదీ పురుషులకు షాక్: ఆ దేశాలకు చెందిన మహిళలను పెళ్లి చేసుకుంటే... 

సౌదీ పురుషులకు షాక్: ఆ దేశాలకు చెందిన మహిళలను పెళ్లి చేసుకుంటే... 

సౌదీ అరేబియా పెళ్లి విషయంలో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది.  సౌదీ అరేబియాకు పనుల నిమిత్తం వివిధ దేశాల నుంచి ఎక్కువమంది ప్రజలు వస్తుంటారు.  అక్కడే పనులు చేసుకుంటూ స్థిరపడుతుంటారు.  ఇలా స్థిరపడిన వ్యక్తులు స్థానికులతో పరిచయాలు ఏర్పడతాయి.  ఆ పరిచయాలే బంధుత్వంగా మారుతున్నాయి.  ఇది సౌదీ అరేబియా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.  దీంతో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది.  పాకిస్తాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్ కు చెందిన మహిళల్ని వివాహం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి.  పెళ్లి చేసుకునే ముందు స్థానిక మేయర్ దగ్గర దరఖాస్తు చేసుకోవాలి.  అయన సంతకం తీసుకోవాలి.  ఆ తరువాత పెళ్ళికి దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న తరువాత ప్రభుత్వం అనుమతి ఇస్తే వివాహం చేసుకోవాలి లేదంటే లేదు.  పైగా దరఖాస్తు చేసుకునే వ్యక్తుల వయసు తప్పనిసరిగా 25 ఏళ్ళు నిండినవారై ఉండాలి.  ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించి తీరాలి.  నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకోవాలని చూస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.  విదేశీ మహిళల సంఖ్య దేశంలో పెరిగి పోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుంది.