ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన కంపెనీ సౌదీ అరాంకో

ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన కంపెనీ సౌదీ అరాంకో

గత ఏడాది అత్యంత లాభదాయకమైన కంపెనీగా సౌదీ అరాంకో నిలిచింది. అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థలు యాపిల్ ఇంక్., ఎక్సాన్ మొబిల్ కార్ప్.లను సునాయాసంగా దాటేసింది. సంస్థ ఖాతాలను ప్రచురించిన ఫిచ్ రేటింగ్స్ సౌదీ అరాంకోని అత్యంత లాభదాయకమైన కంపెనీగా ప్రకటించింది.

గత ఏడాది వడ్డీలు, పన్నులు, తరుగుదల తీయక ముందు సౌదీ ప్రభుత్వ రంగంలోని చమురు ఉత్పత్తి సంస్థ ఆర్జన 224 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఫిచ్ తెలిపింది. అంతర్జాతీయ బాండ్ మార్కెట్ లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న అరాంకోకి ఏ+ రేటింగ్ ఇచ్చింది. అరాంకో లాభాలు యాపిల్ 82 బిలియన్ డాలర్లు, ఎక్సాన్ మొబిల్ 40 బిలియన్ డాలర్లు కలిపిన దాని కంటే ఎక్కువని తేల్చింది. 

అరాంకోకి మొదటిసారి క్రెడిట్ రేటింగ్ ద్వారా కంపెనీ ఖాతాలు పరిశీలించే వీలు కలిగింది. 1970ల చివరలో జాతీయం అయిన సంస్థ ఖాతాలు అప్పటి నుంచి రహస్యంగా ఉంటూ వచ్చాయి. ఇప్పుడు మొదటిసారి బహిర్గతమైన ఖాతాలతో పెట్టుబడిదారులు ఫైనాన్షియల్ మార్కెట్లలో తరానికోసారే వచ్చే డీల్ విలువను అంచనా వేసే వీలు కలిగింది. నిజానికి అరాంకో 2018లోనే పబ్లిక్ ఇష్యూకి రావాలనుకొని దానిని 2021 వరకు వాయిదా వేసింది.