మోడీ నాకు పెద్దన్న లాంటి వాడు..

మోడీ నాకు పెద్దన్న లాంటి వాడు..

దక్షిణాసియా, చైనా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్న సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇవాళ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిశారు. ప్రధాని మోదీ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ వ్యక్తిగతంగా స్వాగతం పలికారు. ఉదయం రాష్ట్రపతి భవన్‌‌కు చేరుకున్న సల్మాన్‌.. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని మోడీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సౌదీ రాజు మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోడీని తాను ఆరాధనా భావంతో చూస్తాననీ... ఆయన తనకు పెద్దన్న లాంటి వారని  అభివర్ణించారు. సౌదీ ఆరేబియాను నిర్మించడం కోసం 70 ఏళ్లుగా భారత ప్రజలు తమ శక్తిని ధారపోశారన్నారు. భారత ప్రజలు తమకు మంచి స్నేహితులుగా తమ రాజ్యం భావిస్తోందన్నారు. ఇరు దేశాల భవిష్యత్తు కోసం మున్ముందు కూడా ఇదే సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నానని సల్మాన్ తెలిపారు.