భారత్ నుంచి హజ్ కోటా పెంపు!

భారత్ నుంచి హజ్ కోటా పెంపు!

భారత్ నుంచి ఏటా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్యను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచుతున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. జపాన్ లోని ఒసాకాలో జరుగుతున్న జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని మోడీ, సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హజ్ కోటా పెంపుపై ఇరువురు చర్చించారు. హజ్ కోటాను 1.7 నుంచి 2లక్షలకు పెంచుతామని మహ్మద్ బిన్ సల్మాన్.. ప్రధాని మోడీకి హామీ ఇచ్చారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ తెలిపారు.