"బీజేపీ నేతల నుంచి బిడ్డల్ని రక్షించుకోండి"

"బీజేపీ నేతల నుంచి బిడ్డల్ని రక్షించుకోండి"

లైంగిక ఆరోపణల్ని ఉటంకిస్తూ బీజేపీ నేతలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్రమోడీ చెప్పే బేటీ పఢావో, బేటీ బచావో నినాదానికి అర్థమే మారిపోయిందని రాహుల్ దెప్పిపొడిచారు. "బేటీ పఢావో బీజేపీ కే నేతావోంసే, మంత్రివోంసే.. బేటీ బచావో బీజేపీ ఎమ్మల్యేస్ సే" అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. 
కేంద్రమంత్రి మీద లైంగిక ఆరోపణలు చేస్తూ మహిళలు కేసులు పెట్టినా, యూపీలో బీజేపీ ఎమ్మెల్యే మీద రేప్ చార్జెస్ ఉన్నా... ప్రధాని నోరు మెదపరని విమర్శించారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా బీజేపీ నేతల మీద రాహుల్ విరుచుకుపడ్డారు.