సావిత్రి కుమార్తె 25టిప్స్ ఇచ్చింది!

సావిత్రి కుమార్తె 25టిప్స్ ఇచ్చింది!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా `మ‌హాన‌టి` రిలీజై పాజిటివ్ నోట్ అందుకుంది. ఒక యథార్థ జీవిత‌క‌థ‌ను క‌లుషితం చేయ‌కుండా య‌థాత‌థంగా తెరకెక్కించార‌న్న పేరొచ్చింది. నాగ్ అశ్విన్‌- స్వ‌ప్న‌ద‌త్‌- అశ్వ‌నిద‌త్ బృందం ఈ రిజ‌ల్ట్‌తో ఆనంద‌డోళిక‌ల్లో తేలియాడుతున్నారు. ముఖ్యంగా మ‌హాన‌టి చిత్రంలో కీర్తి సురేష్ న‌ట‌న‌కు అద్భుత ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. సావిత్రే కీర్తి సురేష్ అంటూ పొగిడేస్తున్నారంతా. ఈ సినిమాలో కీర్తి సురేష్ న‌ట‌న చూసి సావిత్రి కుమార్తె విజ‌య ఛాముండేశ్వ‌రి ఎమోష‌న‌ల్ స్పీచ్ ఇచ్చారు. 

ఛాముండేశ్వ‌రి మాట్లాడుతూ-``కీర్తి అచ్చం అమ్మ‌లానే న‌టించింది. త‌ను స‌హ‌జ‌న‌టి. త‌న‌కు నేను 20-25 టిప్స్ ఇచ్చాను. వాటిలో మినిమం 12 మ్యాన‌రిజ‌మ్స్ తెర‌పై స‌హ‌జంగా కుదిరాయి. ముఖాభిన‌యం, తినే తిండి, కాస్ట్యూమ్స్ ప్ర‌తిదీ వివ‌రించాను. రెండుసార్లు ఆన్ లొకేష‌న్ కి వెళ్లాను. లొకేష‌న్‌లో త‌ను న‌డిచొస్తుంటే అచ్చం అమ్మ న‌డిచొచ్చిన‌ట్టే ఉండేది`` అంటూ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. సావిత్రి క‌థ‌ను య‌థాత‌థంగా ఉన్న‌దున్న‌ట్టు తీశారు. అప్ప‌ట్లో వ‌చ్చిన‌వ‌న్నీ నెగెటివ్ రూమ‌ర్స్ నిజం కాదు. ఈ సినిమాలో చూపించిన‌దే అస‌లు వాస్త‌వం... అని ఛాముండేశ్వ‌రి తెలిపారు.