అక్కడ కామెడీ.. ఇక్కడ యాక్షన్ అంతే తేడా..!!

అక్కడ కామెడీ.. ఇక్కడ యాక్షన్ అంతే తేడా..!!

ఇండస్ట్రీలో కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి.  ఎన్నో జానర్లో సినిమాలు వస్తున్నా.. వాటికి మూలాలు మాత్రం ఏదో ఒక సినిమా నుంచో లేదంటే ఏదైనా నవల నుంచి తీసుకోవడమో జరుగుతున్నది.  నాగచైతన్య కోసం చందు మొండేటి లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ అనే కథతో సవ్యసాచిని తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమా ట్రైలర్ నిన్నటి రోజున రిలీజ్ అయ్యింది.  ట్రైలర్ మంచి టాక్ సొంతం చేసుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  

నాగ చైతన్యకు హిట్స్ ఉన్నా.. ఒక్క మాస్ హిట్ కూడా లేకపోవడంతో... సవ్యసాచిని యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించారు.  ట్రైలర్ లో ఎక్కువ యాక్షన్ సీన్స్ తో పాటు ఆసక్తికరమైన కథను కూడా సూక్ష్మంగా చూపించి ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు.  సవ్యసాచి ట్రైలర్ చూసిన తరువాత మనకు తమిళంలో గతేడాది రిలీజైన పీచన్ కాయ్ అనే పేరుతో సినిమా రిలీజ్ అయింది.  ఇందులో హీరోకు లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ ఉంటుంది.  ఎడమచేయి తన మాట వినదు.  అది ఏది చేయాలనిపిస్తే అది చేస్తుంది.  ఈ లైన్ ను కామెడీగా చూపించి సక్సెస్ అయ్యారు.  ఇప్పుడు ఇదే లైన్ ను నాగచైతన్య సినిమాలో యాక్షన్ ను మేళవించి మాస్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే నవంబర్ 2 వరకు ఆగాల్సిందే.