సమంతను అనుసరిస్తున్న సాయేషా

సమంతను అనుసరిస్తున్న సాయేషా

సౌత్ లో బిజీ హీరోయిన్స్ లో సమంత ఒకరు.  నాగచైతన్యతో వివాహం తరువాత కూడా వరసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.  గతేడాది నాలుగు హిట్స్ తో టాప్ లిస్ట్ లో ఉన్న సమంత ఈ ఏడాది కూడా అదే స్పీడ్ తో దూసుకుపోతున్నది.  రీసెంట్ గా రిలీజైన సూపర్ డీలక్స్ సినిమాకు మంచి టాక్ వచ్చింది.  

ప్రస్తుతం నాగచైతన్యతో మజిలీ చేస్తున్నది.  ఈ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఇదిలా ఉంటె, ఈ బాటలో ఇప్పుడు సయేషా కూడా నడుస్తోంది.  గజినీకాంత్ సినిమా సమయంలో ఆర్యతో ప్రేమలో పడింది.  తరువాత ఇద్దరు వివాహం చేసుకున్నారు.  వివాహం తరువాత ఆమె చేస్తున్న కాప్పన్ సినిమా రిలీజ్ కాబోతున్నది.  దీనితో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా చేసేందుకు సయేషా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  సినిమాల్లో నటించేందుకు వివాహం అడ్డుకాదని ఈ ఇద్దరు హీరోయిన్లు రుజువు చేస్తున్నారు.