పెళ్లి తరువాత సయేషా ఇలా...!!

పెళ్లి తరువాత సయేషా ఇలా...!!

రీసెంట్ గా కోలీవుడ్ లో వివాహం చేసుకున్న కొత్తజంట ఆర్య, సయేషాలు ప్రస్తుతం హానీమూన్ ట్రిప్ లో ఉన్నారు.  హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్లారో తెలియదుగాని, థ్రిల్లింగ్ ఫోటోలను రెగ్యులర్ గా షేర్ చేస్తూ బిజీగా మారింది.  స్విమ్మింగ్ పూల్ పక్కన వైట్ కలర్ గౌన్ లో కూలింగ్ గాగుల్స్ పెట్టుకొని సూర్యకిరణాలు వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఈ ఫొటోకు ఓ అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది.  

భర్తతో కలిసి ఇలా హనీమూన్ కు రావడం చాలా హ్యాపీగా ఉందని అంటున్న సయేషా.. పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్తోంది.  ప్రస్తుతం సయేషా సూర్య, ఆర్య హీరోలుగా చేస్తున్న కాప్పన్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నది.  వీటితో పాటు మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి.