మరోసారి వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

మరోసారి వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. వడ్డీ రేట్లను తగ్గించడం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి. ఈ నెల 1వ తేదీన మొదట.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ.. తాజాగా, మళ్లీ వడ్డీ రేట్లను సవరించింది. ఇవి ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. తాజాగా సవరించిన వడ్డీ రేట్ల విషయానికి వస్తే రిటైల్‌ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్‌ పాయింట్లు, బల్క్‌ డిపాజిట్లపై 30 నుంచి 70 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది ఎస్‌బీఐ. ఇక, 7 నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5 శాతం నుంచి 4.5 శాతానికి, 46 నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.75 శాతం నుంచి 5.5 శాతానికి, 180 నుంచి సంవత్సరం కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేటును 6.25శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్టు ప్రకటించింది.