ఇళ్లు కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు ఇది గుడ్‌న్యూసే..!

ఇళ్లు కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు ఇది గుడ్‌న్యూసే..!

సొంత ఇల్లు కోసం అందరూ కలలు కంటూనే ఉంటారు.. తమ కలల సౌధాన్ని నిర్మించుకోవాలని కొందరు.. నిర్మాణం పూర్తియిన ఇళ్లను కొనుగోలు చేసేందుకు మరికొందరు ఆసక్తి చూపుతారు.. చేతిలో ఉన్న కొంత మొత్తాన్ని చెల్లించి.. మిగతా డబ్బులను హోం లోన్‌గా తీసుకొని చెల్లిస్తారు. అయితే, కొత్త ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నవారికి గుడ్‌న్యూస్ చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. హౌసింగ్ లోన్లపై వడ్డీ రేట్లను ఏకంగా 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజా వడ్డీ రేట్ల ప్రకారం.. కనీస వడ్డీ రేటు 6.70 శాతం నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది ఎస్బీఐ.. ఇక, సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఖరారు చేస్తారు.. వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు.. మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది.. ఫ్రాసెసింగ్ ఫీజు కూడా రద్దు చేసినట్టు తెలిపింది. ఇది.. ఈ ఆఫర్‌కు మార్చి 31 చివరి తేదీగా నిర్ణయించింది ఎస్బీఐ.

అయితే, కస్టమర్ల సిబిల్ స్కోర్ కీలకంగా మారింది.. కస్టమర్ తీసుకోబోయే మొత్తం లోన్ ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయించనున్నారు.. క్రమం తప్పకుండా సమాయానికి చెల్లింపులు చేసే కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి తేవడమే తమ ఉద్దేశంగా ప్రకటించింది ఎస్సీఐ. 75 లక్షల రూపాయల వరకు రుణాలకు వడ్డీ రేటు 6.7 శాతం నుంచి మొదలు కానుండగా.. రూ .75 లక్షలకు పైబడిన రుణాలకు అయితే వడ్డీ రేటు 6.75 శాతం నుంచి ప్రారంభం కానుంది.. ఇక, వినియోగదారులు యోనో యాప్ ద్వారా గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే.. 5 బిపిఎస్ అదనపు రాయితీని పొందవచ్చు. మరోవైపు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళా రుణగ్రహీతలకు ప్రత్యేక 5 బిపిఎస్ రాయితీ లభిస్తున్నట్లు ప్రకటించింది దేశంలోని అతిపెద్ద రుణదాత ఎస్బీఐ. పారదర్శకత కారణంగా మా వినియోగదారులకు మాపై పూర్తి నమ్మకంగా ఉన్నారని.. తగ్గిన వడ్డీ రేట్లు.. లోన్‌పై ఇళ్లు కొనుగోలు చేసేవారికి మంచి అవకాశంగా తెలిపారు ఎస్బిఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సలోని నారాయణ్.