గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ..! రెండు రోజుల్లో అమల్లోకి...

గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ..! రెండు రోజుల్లో అమల్లోకి...

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది... ఇప్పటికే పలు దపాలుగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన ఎస్బీఐ... వడ్డీ రేట్లను మరింత తగ్గించింది. తాజా నిర్ణయంతో బ్యాంక్‌ రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి. కానీ, ఎస్బీఐలో నిర్దిష్ఠ కాలపరిమితికి డిపాజిట్‌ చేసే సొమ్ముపై లభించే వడ్డీకి మాత్రం కోతపడుతుంది. నిధుల సేకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ని 0.05 శాతం తగ్గించింది ఎస్బీఐ.. తగ్గించిన వడ్డీ రేట్లు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ.. ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఇది తొమ్మిదోసారి కావడం విశేషం.. ఎస్బీఐ తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి రుణాలకు వర్తించే ఎంసీఎల్‌ఆర్‌ 7.90 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గిపోనుంది. 

రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడంతో పాటు.. డిపాజిట్లపై వచ్చే వడ్డీలో కోత పడనుంది. రూ.2 కోట్లలోపు డిజిపాజిట్లపై.. కాలపరిమితిని బట్టి వడ్డీ రేటును 0.10-0.50 శాతం మేర తగ్గిపోనుంది. రూ.2 కోట్లు, అంతకు మించిని బల్క్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో 0.25-0.50 శాతం మేర కోత్త పెట్టనున్నారు. 7 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై 4.50 శాతం, 46 రోజుల నుంచి 179 రోజుల డిపాజిట్లపై 5 శాతం, 180 రోజుల నుంచి 210 రోజుల డిపాజిట్లపై 5.50 శాతం, 211 నుంచి ఏడాది లోపు డిపాజిట్లపై 5.50 శాతం, ఏడాది నుంచి రెండేళ్లు... ఆపై 10 ఏళ్ల వరకు 6 శాతం వడ్డీని చెల్లించనుంది ఎస్బీఐ. మొత్తానికి తగ్గిన వడ్డీ రేట్లు సోమవారం నుంచి అమలు చేయనుంది ఎస్బీఐ.