గుడ్‌ న్యూస్ చెప్పిన ఎస్బీఐ

గుడ్‌ న్యూస్ చెప్పిన ఎస్బీఐ

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. రుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ నుంచి కొత్త వడ్డీ రేట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎస్బీ తాజా నిర్ణయంతో గృహ రుణాలతో పాటు ఇతర రిటైల్ రుణాలు తక్కువ వడ్డీకే లభించనున్నాయి.. ఇక పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును రూ.1 లక్ష వరకు 3.5 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించింది. ఇది నవంబర్ 1, 2019 నుండి అమలులోకి వస్తుంది. తన నిధుల ఆధారిత రుణ రేటు లేదా ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎంసీఎల్ఆర్‌లో కోత విధించడం ఇది ఆరోసారి. ఎస్బీఐ యొక్క ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్‌ని 8.15 శాతం నుండి సంవత్సరానికి 8.05 శాతానికి తగ్గుతుంది.