డెబిట్‌ కార్డు కస్టమర్లకు ఎస్‌బీఐ బంపర్ ఆఫర్

డెబిట్‌ కార్డు కస్టమర్లకు ఎస్‌బీఐ బంపర్ ఆఫర్

 డెబిట్‌ కార్డు వాడే తమ కస్టమర్లకు ఎస్‌బీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండగ సీజన్‌లో షాపింగ్‌లో ఖర్చు కోసం డెబిట్‌ కార్డును వాడుకుని ఖర్చైన మొత్తాన్ని వాయిదాలుగా (ఈఎంఐలు) చెల్లించవచ్చని ప్రకటించింది. సోమవారం నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని తెలిపింది. ఆరు నుంచి 18 నెలల మధ్యలో వాయిదాల కాలాన్ని ఎంచుకోవచ్చని, దేశవ్యాప్తంగా 1500 నగరాల్లోని 40 వేలకు పైగా స్టోర్స్ లో  ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

ఇందుకోసం ఏవిధమైన పత్రాలు కానీ, ప్రాసెసింగ్‌ ఫీజును కానీ చెల్లించనవసరం లేదని, ఎంపిక చేసిన బ్రాండ్లపై వడ్డీలేని వాయిదాలు కూడా ఉంటాయని వివరించింది. సేవింగ్స్‌ ఖాతాలో అకౌంట్‌ బ్యాలెన్స్‌తో సంబంధం లేకుండా ఒక్క నిమిషంలోనే ఈ సదుపాయం పొందవచ్చని వెల్లడించింది. లావాదేవీ పూర్తయిన నెల తర్వాత నుండి ఈఎంఐలు మొదలవుతాయట. మెరుగైన క్రెడిట్‌ హిస్టరీ కలిగిన కస్టమర్లందరూ ఈ రుణాలను పొందవచ్చని ఆ సంస్థ ప్రకటనలో పేర్కొంది. కస్టమర్లు తమ అర్హతను చెక్‌ చేసుకునేందుకు డీసీఈఎంఐ అని టైప్‌ చేసి 567676 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలని తెలిపింది