తగ్గిన వడ్డీ రేట్లు.. అమలు ఎప్పటి నుంచి అంటే..?

తగ్గిన వడ్డీ రేట్లు.. అమలు ఎప్పటి నుంచి అంటే..?

సొంత ఇంటి కలలు కనేవారికి గుడ్ న్యూస్.. హోమ్ లోన్స్‌పై వడ్డీరేట్లు భారీగా ఉన్నాయే అనే బాధ అవసరం లేదు. హోమ్ లోన్స్‌పై మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది భారత అతిపెద్ద ప్రభుత్వరంగబ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గృహరుణాలపై వడ్డీరేట్లను 15 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇక తగ్గిన వడ్డీరేట్లు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా వడ్డీరేట్లను తగ్గించడం ఇది నాల్గోసారి కావడం విశేషం. ఎస్‌బీఐ కొత్త వడ్డీ రేట్ల ప్రకారం ఎంసీఎల్‌ఆర్‌ ఏడాది కాల వ్యవధి రుణాలకు 8.25 శాతంగా ఉండనుంది. ఇప్పటి వరకు ఇది 8.40శాతంగా ఉంది. ఇంకా ఎందుకు ఆలస్యం.. గృహరుణాన్ని పట్టండి.. మీ సొంతింటి కల నెరవేర్చుకోండి.