ఎస్బీఐ: జీరో బ్యాలెన్స్‌తో కొత్త ఖాతా

ఎస్బీఐ: జీరో బ్యాలెన్స్‌తో కొత్త ఖాతా

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది... ఇన్నాళ్లు మినిమం బ్యాలెన్స్ పేరుతో కస్టమర్ల ముక్కుపిండి సొమ్ము వసూలు చేసిన ఎస్బీఐ... తర్వాత రూరల్, సెమీ అర్బన్, అర్బన్‌లలో మూడు భాగాలుగా విభజించి ఆ జరిమానా మొత్తాన్ని కొంతమేర తగ్గించి కాస్త ఉపశమనం కలిగించింది. ఇక తాజాగా మరో గుడ్ న్యూస్ వినిపించింది ఎస్బీఐ... జీరో బ్యాలెన్స్‌తో కొత్తగా ఇన్ట్సా సేవింగ్ ఖాతాను ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ ఈ ఏడాది ఆగస్టు వరకే అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. 

ఇక ఇన్ట్సా ఎస్బీఐలో ఖాతా ఓపెన్ చేయాలంటూ ఏ బ్రాంచీని సందర్శించాల్సిన అవసరం లేదు... ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో  సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసి ఎస్బీఐలో ఖాతా తెరుచుకునే వేసులుబాటును కూడా కల్పించింది. ఈ జీరో బ్యాలెన్స్ ఖాతా ఆఫర్ కేవలం పరిమిత కాలం ఆఫర్ మాత్రమేనని ఎస్బీఐ ప్రకటించింది. ఈ పేపర్లను సంబంధిత బ్రాంచ్‌లో సమర్పించాల్సిన అవసరం లేకుండా పేపర్‌లెస్ ఎకౌంట్‌ ఓపెన్ చేసే అవకాశాన్ని ఎస్బీఐ అందిస్తోంది. ఈ ఎకౌంట్ ఓపెన్ చేసిన వినియోగదారులు రూపీ డెబిట్ కార్డును అందిస్తోంది. ఈ ఖాతాలో వినియోగదారుడు లక్ష రూపాయాల వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉండగా... వార్షిక లావాదేవీల పరిమితి రూ.2 లక్షలుగా ఉంటుంది. ఇక ఈ ఖాతాను ఒక ఏడాది తర్వాత సాధారణ సేవింగ్ ఖాతాగా మార్చుకునే వీలుండగా... ఆ సమయంలో వినియోగదారుడు సంబంధిత బ్రాంచ్‌ని సందర్శించాల్సి ఉంటుంది.