డిపాజిట్లు, స్వల్పకాలిక రుణాల రేట్లను రెపో రేటుకి ముడిపెట్టిన ఎస్బీఐ

డిపాజిట్లు, స్వల్పకాలిక రుణాల రేట్లను రెపో రేటుకి ముడిపెట్టిన ఎస్బీఐ

మే 1 నుంచి తమ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు, స్వల్పకాలిక రుణాలను ఆర్బీఐ రెపో రేటుతో ముడిపెట్టనున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం ప్రకటించింది. అయితే రూ.1,00,000 లోపు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాదారులను, రూ.1,00,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి కలిగిన రుణగ్రహీతలను ఈ ప్రణాళిక నుంచి మినహాయిస్తున్నట్టు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు తెలిపింది.

ఈ తాజా నిర్ణయంతో డిపాజిట్లు, స్వల్పకాలిక రుణాలను రెపో రేటుతో లింక్ చేసిన మొదటి భారతీయ బ్యాంకు ఎస్బీఐ అయింది. కేంద్ర బ్యాంక్ రెపో రేట్లు తగ్గించినప్పటికీ భారతీయ బ్యాంకులు సాధారణంగా రుణాలపై రేట్లను తగ్గించేందుకు విముఖత చూపిస్తుంటాయి. డిపాజిట్ రేట్లపై అధిక వడ్డీలను దీనికి కారణంగా చెబుతున్నాయి. దీంతో రెపో రేట్ తగ్గింపు ప్రభావం రుణగ్రహీతలపై పరిమితంగానే ఉంటుంది.