ఎస్బీఐ కొత్త రూల్స్‌... నిన్న‌టి నుంచే అమ‌ల్లోకి...

ఎస్బీఐ కొత్త రూల్స్‌... నిన్న‌టి నుంచే అమ‌ల్లోకి...

క‌రోనా క‌ట్ట‌డికి కేంద్రం లాక్‌డౌన్ విధించ‌డంతో.. ఆ స‌మ‌యంలో వివిధ బ్యాంకు లావాదేవీల‌పై ఉన్న ప‌రిమితుల‌ను ఎత్తివేసింది ఆర్బీఐ.. ముఖ్యంగా.. ఏటీఎం విత్‌డ్రాలు, మినిమం బ్యాలెన్స్ ఉన్నాయి...  ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినాస‌రే.. ఎన్నిసార్లు అయినా.. డ‌బ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది కేంద్రం... అంతేకాదు.. అస‌లే డ‌బ్బులు లేకుండా ఇబ్బంది ప‌డే ప‌రిస్థితి అని.. మినిమం బ్యాలెన్స్ నిబంధ‌న‌లు కూడా ఎత్తివేసింది.. వాటికి అద‌నంగా ఎలాంటి ఛార్జీలు వ‌సూలు చేయ‌బోమ‌ని ప్ర‌క‌టించారు. వీటిని అన్ని బ్యాంకులు అమ‌లు చేశాయి.. ఇప్పుడు లాక్‌డౌన్ ముగిసి అన్‌లాక్ న‌డుస్తోన్న స‌మ‌యంలో.. మ‌ళ్లీ బ్యాంకులు వ‌డ్డింపులు షురూ చేశాయి.. దీనిలో భాగంగా దేశంలోనే అతిపెద్ద ప్ర‌భుత్వ‌రంగ‌ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది.. జులై 1వ తేదీ నుంచే ఇవి అమ‌ల్లోకి వ‌చ్చాయి. 

ఇక‌, ఎస్బీఐ గ‌తంలో ఇచ్చిన స‌డ‌లింపులు జూన్ 30వ తేదీతో ముగిసిపోయాయి... జులై 1వ తేదీ నుంచి చార్జీల వ‌డ్డ‌న త‌ప్ప‌దు.. ఎస్బీఐ కొత్త రూల్స్‌ను ప‌రిశీలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో ఏటీఎం నుంచి నెలకు 8 విత్‌డ్రాయిల్స్‌ మాత్రమే ఫ్రీగా పొందే అవ‌కాశం ఉంటుంది.. వీటిలో ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఐదు, ఇతర బ్యాంకుల నుంచి మూడు విత్‌ డ్రాయిల్స్‌ను మాత్ర‌మే ఉచితంగా పొంద‌వ‌చ్చు.. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే.. విత్‌డ్రాయిల్స్‌ సంఖ్య 10గా ఉంది.. ఇందులో ఐదు ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి, మిగ‌తా ఐదు ఇతర బ్యాంక్‌ ఏటీఎంల నుంచి చేసుకోవ‌చ్చు.. ఈ ప‌రిమితి మించితే మాత్రం ఛార్జీలు వ‌డ్డింపు త‌ప్ప‌దు.. ఆపై లావాదేవీల‌కు  రూ. 20 తోపాటు అదనంగా జీఎస్టీ వ‌సూలు చేస్తారు. క్యాష్ విత్‌డ్రా కాకుండా.. ఇతర సేవలు... అంటే.. బ్యాలెన్స్ చెక్ చేయ‌డం, పిన్ మార్చుకోవ‌డం.. వంటి సేవలకు అయితే.. రూ.8తో పాటు జీఎస్టీ కూడా వ‌సూలు చేయ‌నున్నారు. ఇక‌, బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్  నిబంధ‌న మ‌ళ్లీ అమ‌ల్లోకి వ‌చ్చింది.. మినిమం బ్యాలెన్స్ లేక‌పోతే గ‌తంలో వ‌డ్డించిన విధంగా మ‌ళ్లీ ఛార్జీలు వ‌సూలు చేయ‌నుంది ఎస్బీఐ.. చార్జీల‌కు జీఎస్టీ అద‌నంగా ఉంటుంది.