మే 6కి రాఫెల్ పునస్సమీక్ష విచారణ వాయిదా

మే 6కి రాఫెల్ పునస్సమీక్ష విచారణ వాయిదా

రాఫెల్ కేసులో దాఖలైన పునస్సమీక్ష పిటిషన్ విచారణను సుప్రీంకోర్ట్ వచ్చే సోమవారం (మే 6)కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరడంతో సుప్రీం ఈ నిర్ణయం తీసుకొంది. శనివారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి కోర్టు సూచించింది.

ఏప్రిల్ 10న సుప్రీంకోర్ట్ పునస్సమీక్ష పిటిషన్ల విచారణకు నిర్ణయించింది. పిటిషనర్లు సమర్పించిన పత్రాల ఆమోదయోగ్యతపై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ప్రాథమిక అభ్యంతరాలను అత్యున్నత న్యాయస్థానం తోసి పుచ్చింది. 

రాఫెల్ డీల్ లో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను తిరస్కరిస్తూ డిసెంబర్ 14న సుప్రీంకోర్ట్ తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ పిటిషనర్లు ద హిందూ, ద కారవాన్ మేగజైన్, ఇతర పత్రికల్లో వచ్చిన వార్తాకథనాల ఆధారంగా ఈ తీర్పుని సమీక్షించాలని కోరారు.