రాఫెల్‌: తీర్పు సమీక్షకు సుప్రీం ఓకే

రాఫెల్‌: తీర్పు సమీక్షకు సుప్రీం ఓకే

సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై తాము ఇదివరకే ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అన్నారు. అనేక తప్పుల తడకలతో కేంద్రం కోర్టుకు నివేదిక ఇచ్చిందని, వాటి ఆధారంగా ఇచ్చిన తీర్పును సమీక్షించాలని ప్రముఖ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ వేసిన పిటిషన్‌ను ఆయన విచారించారు. తీర్పు సమీక్షను పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు.