నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు

నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు

సుప్రీం కోర్టు కొలిజియం నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లతో కూడిన కొలిజియం ఈనెల 9న సమావేశమై ఈ సిఫారసు చేసింది.

ప్రస్తుతం తెలంగాణ, ఆంధప్రదేశ్‌ హైకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలిజియం సిఫారసు చేసింది. అలాగే బాంబే హైకోర్టులో అత్యంత సీనియర్‌ అయిన జస్టిస్‌ ఎన్‌ హెచ్‌ పాటిల్‌ ను (ప్రస్తుతం ఈయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి) అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. ఇక గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టులో పనిచేస్తున్న సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌ బొపన్న పేరును... అలాగే కోల్‌కతా హైకోర్టుకు ఇపుడు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ డీకే గుప్తాను అదే కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది.