రెండు నెలల్లోగా నిధులు ఇవ్వండి : సుప్రీం

రెండు నెలల్లోగా నిధులు ఇవ్వండి : సుప్రీం

రాష్ట్రాల్లోని న్యాయస్థానాలకు  రెండు నెలల్లోగా నిధులు ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. యుటిలైజేషన్ సర్టిఫికేట్లు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి... వాటికి సంబంధించిన నివేదికలను కోర్టులో సమర్పించాలని కోరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కేసును విచారణకు సుమోటాగా స్వీకరించారు.  దేశ వ్యాప్తంగా ఉండే సబార్డినేట్ కోర్టుల్లోని ఖాళీల సంఖ్య, న్యాయస్థానాల్లో మౌళిక సదుపాయాల పరిస్థితులను వెల్లడించాలని ఆదేశించింది. పెండింగ్ లోని ఉన్న సర్టిఫికెట్ల నివేదికలను నాలుగు వారాల్లోగా సమర్పించాలని రాష్ట్రాలను సైతం కోర్టు ఆదేశించింది.