దినకరన్‌ పార్టీకి 'కుక్కర్‌' గుర్తు?

దినకరన్‌ పార్టీకి 'కుక్కర్‌' గుర్తు?

తమిళనాడులో జరగనున్న వచ్చే ఎన్నికలలో టీటీడీ దినకరన్‌ పార్టీ అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)కు తాత్కాలిక చిహ్నాంగా 'ప్రెషర్‌ కుక్కర్‌'ను కేటాయించాలని ఎలక్షన్‌ కమీషన్‌ (ఈసీ)కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఢిల్లీ హైకోర్టు నాలుగు వారాలలోగా రెండాకులు గుర్తుపై ఎటువంటి నిర్ణయం తెలపకపోతే కుక్కర్‌ గుర్తును దినకరన్‌ పార్టీకి ఇవ్వనున్నారు.

గత మార్చి 9న ఏఎంఎంకే పార్టీకీ 'ప్రెషర్‌ కుక్కర్‌' గుర్తు ఇవ్వాలని చెన్నై హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు సూచించింది. దీనిపై పళనిస్వామి వర్గం సుప‍్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హత కారణంగా ఖాళీ అయిన 18 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నాలుగు వారాల్లోగా ఈసీ నోటిఫికేషన్‌ ఇవ్వగలిగితే.. ఏఎంఎంకే పార్టీకి ప్రెషర్‌ కుక్కర్‌ గుర్తును కేటాయించాలని సుప్రీం తెలిపింది. లేనిపక్షంలో ఎన్నికల కమిషన్‌ తన ఇష్టానుసారంగా గుర్తును కేటాయిస్తుందని తీర్పునిచ్చింది.