పుల్వామా ఉగ్రదాడి కుట్రపై దర్యాప్తు పిల్ ని కొట్టేసిన సుప్రీం

పుల్వామా ఉగ్రదాడి కుట్రపై దర్యాప్తు పిల్ ని కొట్టేసిన సుప్రీం

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడి వెనుక మరో పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తూ దీనిపై దర్యాప్తు జరగాలని దాఖలైన పిల్ ను సుప్రీంకోర్ట్ కొట్టేసింది. న్యాయవాది వినీత్ ధండా దాఖలు చేసిన పిల్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు తీసిన దాడి వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దానిపై దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఉగ్రదాడిలో సుమారుగా 370 కేజీల ఆర్డీఎక్స్ ఉపయోగించినందువల్ల దీనిపై లోతైన దర్యాప్తు అవసరం అని పిటిషన్ లో పేర్కొన్నారు.