వీవీ ప్యాట్‌ లెక్కింపుపై పిల్ కొట్టివేత..

వీవీ ప్యాట్‌ లెక్కింపుపై పిల్ కొట్టివేత..

వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో మరోసారి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ 21 విపక్ష పార్టీలో గతంలో వేసిన పిటిషన్‌ను ఇప్పటికే కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్రతీ నియోజకవర్గానికి ర్యాండమ్‌గా ఐదు వీవీ ప్యాట్లను లెక్కిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. కాగా, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది సాంకేతిక నిపుణులు... 50 శాతం వీవా ప్యాట్లు కాదు.. 100 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలన్న పిటిషన్‌ను కొట్టివేసినట్టుగానే... 100 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని దాఖలైన పిటిషన్లను కూడా కొట్టివేసింది.