మాజీ ఐపీఎస్ అధికారికి రక్షణ కల్పించండి

మాజీ ఐపీఎస్ అధికారికి రక్షణ కల్పించండి

పశ్చిమ బెంగాల్ మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘెష్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏ కేసులో అరెస్ట్ చేయకుండా ఆమెకు రక్షణ కల్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎలాంటి నిర్భంధ చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ పై రద్దయిన పెద్దనోట్లకు బంగారం మార్పిడి, బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలపై పది కేసులు నమోదై ఉన్నాయి.