పుదుచ్చేరి ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టు నోటీసులు

పుదుచ్చేరి ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టు నోటీసులు

పుదుచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్లమెంటరీ సెక్రటరీ కే. లక్ష్మీనారాయణన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కలగచేసుకుంటున్నారని ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా.. రోజూ వారీ ప్రభుత్వ కార్యక్రమాలలో లెఫ్టినెంట్ గవర్నర్ కల్పించుకోకూడదంటూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ కిరణ్ బేడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్ కు అత్యున్నత న్యాయస్ధానం నోటీసులు జారీచేసింది.