నిర్భయ కేసు విచారణ: సొమ్మసిల్లి పడిన జడ్జి !

నిర్భయ కేసు విచారణ: సొమ్మసిల్లి పడిన జడ్జి !

నిర్బయ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్ భానుమతి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే విచారణ వాయిదా వేసి ఆమెను చాంబర్‌కు తరలించారు. దోషులను వేర్వేరుగా ఉరితీయాలన్న కేంద్రం పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మరోవైపు  దోషి వినయ్‌ శర్మ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వినయ్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రపతి నిర్ణయాన్ని సమర్థించింది. వినయ్ శర్మ మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయని తెలిపింది.