అసంఘటిత కార్మికులపై సుప్రీం తీర్పు...

అసంఘటిత కార్మికులపై సుప్రీం తీర్పు...

అసంఘటిత రంగాల్లో కనీస వేతలపై దాఖలైన పిల్ ను  సుప్రీంకోర్ట్ తిరస్కరించింది. సమాజ సేవకుడు స్వామి అగ్నివేశ్ భారత అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. అసంఘటిత రంగాల్లో సుమారు 50 కోట్ల మంది ఉంటారని వారికి కనీసవేతనాలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ , జస్టిస్ ఎస్ కె కౌల్ కూడిన ఈ బెంచ్  ఈ విషయమై సంబంధిత అధికారులను సంప్రదించాలని అగ్నివేశ్ కూ 
సూచించింది. అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి కనీస వేతనాలు సంబంధించి ఆర్టికల్ 14లో చెబుతుందని వివరించారు. అసంఘటిత రంగాలు ఆర్టికల్ 14,21,39 ని అతిక్రమిస్తున్నాయని పిల్ లో పేర్కొన్నారు.