జస్టిస్‌ లోయా మృతి కేసును కొట్టివేసిన సుప్రీం

జస్టిస్‌ లోయా మృతి కేసును కొట్టివేసిన సుప్రీం
అనామానాస్పద స్థితిలో మృతి చెందిన బీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ బీహెచ్‌ లోయా మృతి కేసును కొట్టివేసింది సుప్రీంకోర్టు... జస్టిస్ లోయా మృతి కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిపే అంశంపై తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాస్థానం... లోయా మృతిపై స్వతంత్ర దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. జస్టిస్ లోయా మృతిపై అనుమానాలు వద్దని అభిప్రాయపడిన కోర్టు... ఈ కేసులో మళ్లీ దర్యాప్తు అవసరంలేదని పేర్కొంది. కాగా, సోహ్రబుద్దీన్‌ షేక్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసును విచారిస్తున్న జస్టిస్‌ లోయా... నాగపూర్‌లో 2014 డిసెంబర్‌ 1న హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. సోహ్రబుద్దీన్ కేసులో తీర్పు మరికొన్ని రోజుల్లో రానున్న నేపథ్యంలో జస్టిస్ లోయా మృతి చెందడం పలు అనుమానాలు తావు ఇచ్చింది... ముఖ్యంగా ఆయన మృతిపై సందేహాలు వ్యక్తం చేశారు కుటుంబసభ్యులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఎఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించింది.