శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో ఊరట

శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో ఊరట

భారత స్టార్ బౌలర్ శ్రీశాంత్ కు సుప్రీంలో ఊరట లభించింది. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో బిసిసిఐ విధించిన జీవితకాల సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో ఈ కేసును విచారించి బెంచీ అతనిపై నిషేధం విషయంలో మూడు నెలల్లోగా తాజాగా మరో నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించింది. శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం చాలా కఠినమైన శిక్షగా బెంచీ అభివర్ణించింది. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో తన ప్రమేయం ఏమీ లేదని, తాను ఎలాంటి పొరపాటు చేయలేదని శ్రీశాంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తన తప్పేమీ లేదని, ఈ విషయం త్వరలోనే బయటపడుతుందని ఇటీవలే ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితి తనకు ఎందుకు ఎదురైందో ఇప్పటికీ అర్థం కావడం లేదని అన్నాడు.సస్పెన్షన్ నిర్ణయం బాధాకరమని, తనను మానసిక వేదనకు గురి చేసిందని శ్రీశాంత్ చెప్పాడు. తొమ్మిది సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పటికీ, తనకు ఎవరూ అండగా నిలవలేదని వాపోయాడు.