మే 6లోగా వాళ్లిద్దరి ఉల్లంఘన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోండి

మే 6లోగా వాళ్లిద్దరి ఉల్లంఘన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోండి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన 9 ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్ట్‌ గురువారం ఎన్నికల సంఘానికి సూచించింది. ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు మే 6ని తుది గడువుగా సుప్రీంకోర్ట్ ప్రకటించింది. 

మోడీ, షాలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన 11 ఫిర్యాదుల్లో రెండిటిపై ఇప్పటికే తమ నిర్ణయం ప్రకటించినట్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ కి ఎలక్షన్ కమిషన్ తెలిపింది. 

తాము 40 ఫిర్యాదులు చేస్తే కేవలం 20పైనే ఉత్తర్వులు జారీ చేసినట్టు కాంగ్రెస్ తెలిపింది. అవి కూడా ప్రధాని మోడీ, అమిత్ షాలపై కాకుండా ఇతరులపైనవని చెప్పింది. సోమవారానికల్లా అన్ని ఫిర్యాదులపై తన నిర్ణయం ప్రకటించాలని కోర్టు ఈసీకి సూచించింది.