జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై మ‌రోకేసు న‌మోదు..

జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై మ‌రోకేసు న‌మోదు..

బీఎస్‌-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు, అలాగే ఫేక్ ఇన్సూరెన్స్ పేప‌ర్స్ తయారు చేశారన్న అభియోగాల‌పై త‌న కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డితో పాటు అరెస్ట్ అయిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు కావ‌డంతో 54 రోజుల త‌ర్వాత జైలు నుంచి విడుద‌ల‌య్యారు. అయితే.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై తాజాగా మ‌రో కేసు న‌మోదు అయ్యింది.. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్  పోలీస్ స్టేషన్‌లో ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ  కింద కేసు న‌మోదు చేశారు పోలీసులు.. తాడిపత్రి రూరల్ పరిధిలోని బొందలదిన్నె ద‌గ్గ‌ర జేసీ కాన్వాయ్‌ని అడ్డుకున్న సీఐ దేవేంద్ర కుమార్‌, పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.. దీంతో.. కాసేపు ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది.. అయితే.. సీఐ దేవేంద్ర కుమార్ ఫిర్యాదు చేయ‌డంతో.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ , ఎస్టీ కేసు న‌మోదైంది.. జేసీపై 189, 353, 506 ఆర్ / డ‌బ్ల్యూ 34 ఐపీసీ 3(2) (va), 3(1) ఆర్‌, 3(1)ఎస్‌, sc, st poa act , 52 సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు..