మోడీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి: శివాజీ

మోడీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి: శివాజీ

ప్రధాని మోడీ నియంతృత్వ పోకడలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారేం శివాజీ అన్నారు. ఈ రోజు అయన విజయనగరంలో మాట్లాడుతూ... విశాఖ సభకు వస్తున్న మోడీని 'గోబ్యాక్ మోడీ' అంటూ ప్రజలంతా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. మోడీ విభజన హామీలు నేటికీ నెరవేర్చలేదని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తో చేతులు కలిపి ఏపీలో పరిశ్రమలు రాకుండా చూస్తున్నారని కారేం శివాజీ ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం పాటు పడే వ్యక్తి చంద్రబాబు అని కారేం శివాజీ పేర్కొన్నారు. కేటీఆర్.. వైసీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చేప్తున్నారంటే అర్దం అవుతోంది టీఆర్ఎస్ వైఎస్ జగన్ వెనుక వస్తోందని. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారి కేసులు మాఫీ చేయడానికి ఏపి కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.