కతువా ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీం

కతువా ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా అత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, జమ్మూ-కశ్మీర్‌ బార్‌ కౌన్సిల్‌కూ సుప్రీం లిఖితిపూర్వక సమాచారాన్ని పంపింది. బాధితురాలికి సంబంధించిన చిరునామా, వ్యక్తిగత వివరాలు బయటకు చెప్పకూడదని మీడియాను ఆదేశించింది. ఈ కేసు పురోగతిని, బాధితురాలి తరఫున వాదించడానికి అంగీకారం తెలిపిన న్యాయవాదిని బెదిరించారన్న వార్తల వివరాలను సమర్పించాలని పోలీసు శాఖను సుప్రీం కోరింది. కశ్మీర్‌లోని కతువా జిల్లాకు చెందిన 8 ఏళ్ల చిన్నారి ఈ ఏడాది జనవరిలో కనిపించకుండా పోయింది. వారం రోజుల తర్వాత స్థానిక అడవుల్లో బాలిక శవమై కనిపించింది. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెపై అత్యాచారం జరింగిందని తేలింది.