కోర్టు ముందుకు అక్బర్ వర్సెస్ ప్రియారమణి..

కోర్టు ముందుకు అక్బర్ వర్సెస్ ప్రియారమణి..

లేడీ జర్నలిస్టు ప్రియారమణిని లైంగికంగా వేధించారన్న ఆరోపణల కేసులో మంత్రి పదవి నుంచి వైదొలగిన ఎంజే అక్బర్ కేసు రేపే సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వస్తోంది. తనను పలు సందర్భాల్లో అక్బర్ వేధించారంటూ ప్రియారమణి ఆరోపించడంతో సోషల్ మీడియాలో "మీటూ" అంటూ ఆమెకు మద్దతు పెరిగింది. దీనిపై ముందు పరువునష్టం దావా వేస్తానని బెదిరించిన అక్బర్.. ప్రియారమణి పట్టు వీడకపోవడంతో పదవికి గుడ్ బై చెప్పి విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది.