జయ మృతి కేసుపై సుప్రీం కీలక ఆదేశాలు.. 

జయ మృతి కేసుపై సుప్రీం కీలక ఆదేశాలు.. 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో జస్టిస్ అరుముగస్వామి కమిటీ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ కమిటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అపోలో ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసొంది. ఈక్రమంలో ఆపోలో ఆస్పత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ ఈ  కేసును విచారించింది. జస్టిస్ అరుముగస్వామి కమిటీ విచారణపై స్టే విధించింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం అరుముగస్వామి కమిటీని నియమించింది.