రేపు సుప్రీంకోర్టులో సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ కేసు విచారణ

రేపు సుప్రీంకోర్టులో సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ కేసు విచారణ

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ కేసులో రేపు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. తన పదవీకాలం పూర్తికాక ముందే  డైరెక్టర్‌ పదవి నుంచి తొలగిస్తూ అంటే సెలవుపై పంపడాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీం కోర్టులో పిటీషన్‌ వేశారు. స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్తానాపై అవినీతి ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, అంతకుముందే అలోక్‌ వర్మ అవినీతికి పాల్పడ్డారని రాకేష్‌ ఆస్తానా సీవీసీకి ఫిర్యాదు చేయడంతో ఇద్దరిని కేంద్ర ప్రభుత్వం సెలవుపై పంపింది. అలోక్‌ వర్మ కేసుపై విచారణ చేసిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది.