కర్ణాటక ఎమ్మెల్యేల అనర్హత పై సుప్రీం కీలక తీర్పు

కర్ణాటక ఎమ్మెల్యేల అనర్హత పై సుప్రీం కీలక తీర్పు


కర్ణాటకలో అనర్హత వేటు పడ్డ 17 మంది ఎమ్మెల్యేల భవితవ్యం తేలిపోయింది. జస్టిస్ ఎన్వీ రమణ, సంజీవ్ ఖన్నా, కృష్ణమురారిలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులో తీర్పు వెల్లడించింది. గత నెల 25న ఈకేసు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది సుప్రీంకోర్టు. కుమారస్వామిపై అవిశ్వాసతీర్మానం సమయంలో కర్నాటక అసెంబ్లీకి హాజరు కానీ 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్ అనర్హత వేటువేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్నాటకలో ఉప ఎన్నికల్లో తమను పోటీకి అనుమతించాలని విజ్ఞప్తిచేశారు. అయితే కోర్టు ఆ పదిహేను మందీ ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పేర్కొంది.

వారిపై పడ్డ అనర్హత వేటును సమర్థించిన సుప్రీంకోర్టు, ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసిన ప్రజలను వారు మోసం చేసినట్టేనని అభిప్రాయపడింది. మరోమారు ఇటువంటి తప్పు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని, ఫిరాయింపులను ప్రోత్సహించరాదని సూచించింది. ఇదే సమయంలో అనర్హత వేటు వేసిన స్పీకర్ పైనా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎవరినీ నిషేదించలేమని, ఆ అధికారం స్పీకర్ కు లేదని అభిప్రాయపడింది. 2025 వరకూ వారిపై వేసిన అనర్హత వేటును తొలగిస్తున్నామని స్పష్టం చేసింది.