'టిక్‌టాక్‌'పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

'టిక్‌టాక్‌'పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

తమిళనాడులో టిక్‌టాక్‌ యూజర్స్‌కు గుడ్‌న్యూస్‌. టిక్‌టాక్‌ యాప్‌పై మాద్రాస్‌ హైకోర్టు విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు తాత్కాలికంగా ఎత్తివేసింది. ఇరుపక్షాల వాదనను విన్న తర్వత తుది నిర్ణయం తీసుకుంటామని.. అప్పటి వరకు బ్యాన్‌ను ఎత్తివేయాలని సూచించింది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ మద్రాస్‌ హైకోర్టు విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ టిక్‌టాక్‌ సంస్థ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ కేసును ఇవాళ విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఏప్రిల్‌ 24వ తేదీన తమ వెర్షన్‌ను వినిపించాల్సిందిగా టిక్‌టాక్‌కు సూచించింది.