రాజీవ్ కుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

రాజీవ్ కుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

కోల్‌కతా మాజీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శారదా చిట్ ఫండ్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ కుమార్ అరెస్ట్ పై ఉన్న స్టేను ఎత్తివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ కోసం రాజీవ్ కుమార్ వారంలోగా పిటీషన్ దాఖలు చేసుకోవచ్చని సీజే రంజన్ గొగొయ్, జస్టిస్ దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం తెలిపింది. రాజీవ్ కుమార్ ను కస్టడీలోకి తీసుకునేందుకు సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చిట్ ఫండ్ స్కాం ఆధారాలు మాయం చేయడంలో రాజీవ్ కుమార్ పాత్ర ఏంటో నిరూపిస్తే అప్పుడు తాము గతంలో ఇచ్చిన స్టేను వాపసు తీసుకుంటామని సుప్రీం కోర్టు సీబీఐకి తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.