నేడు పేరవరం నుంచి జగన్ పాదయాత్ర...

నేడు పేరవరం నుంచి జగన్ పాదయాత్ర...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది... 189వ రోజు పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు జగన్. పేరవరం నుంచి వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్ రోడ్ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్ రాత్రి అక్కడే బసచేస్తారు. ఇప్పటి వరకు 2329 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ... ప్రభుత్వ తీరును ఎండగడుతూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు ప్రతిపక్ష నేత.