అమెరికాలో మళ్లీ కాల్పులు.. విద్యార్థి మృతి

అమెరికాలో మళ్లీ కాల్పులు.. విద్యార్థి మృతి

అమెరికాలో మరోసారి తుపాకీల మోత మోగింది. ఓ పాఠశాలలోకి చొరబడి దుండగులు కాల్పులు జరపడంతో ఒక విద్యార్థి మృతి చెందాడు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొలరాడో రాష్ట్రం డెన్వర్‌లో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.