రేపటి నుంచే స్కూళ్ళు...

రేపటి నుంచే స్కూళ్ళు...

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే స్కూళ్ళు ఓపెన్ అయ్యాయి.  7 నుంచి 10 తరగతి వరకు స్కూళ్ళు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఒక్కపూట మాత్రమే స్కూల్స్ ఓపెన్ లో ఉన్నాయి.  అయితే, జనవరి 18 వ తేదీ నుంచి ఒక్కపూట కాకుండా రెండు పూటలా స్కూల్స్ తెరుచుకోబోతున్నాయి.  అంతేకాదు, ఆరో తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన స్కూల్స్, కళాశాలలు ప్రారంభం కాబోతున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, దేశరాజధాని ఢిల్లీలో కూడా రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి.  ఢిల్లీలో సీబీఎస్ఈ చదివే 10, 12 వ తరగతి విద్యార్థుల కోసం స్కూల్స్ ను ప్రారంభించబోతున్నారు.  మార్గదర్శకాలను రిలీజ్ చేసింది ప్రభుత్వం.  ఎప్పటికప్పుడు స్కూల్స్ ను శానిటైజ్ చేయాలని ఆదేశించింది.  ప్రతి స్కూల్ ఎంట్రీ గేట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది.  కరోనా లక్షణాలున్న విద్యార్థులు, ఉపాధ్యాయులను స్కూల్ ఆవరణలోకి రాకూడదని ఆదేశించింది.  కంటైన్మెంట్ జోన్ల వెలుపల మాత్రమే స్కూల్స్ ఓపెన్ చేయాలని నిర్ణయించారు.