నేడు స్కూళ్ల పునఃప్రారంభం.. ఇవీ టైమింగ్స్‌

నేడు స్కూళ్ల పునఃప్రారంభం.. ఇవీ టైమింగ్స్‌

ఎండాకాలం సెల‌వులు ముగియ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు స్కూళ్ళు తెరుచుకోనున్నాయి. నెల రోజులకు పైగా వేసవి సెలవులతో ఇళ్లలో సేదతీరిన విద్యార్థులు ఇవాళ్టి నుంచి బడి బాట పట్టనున్నారు.
తెలంగాణలో ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే పాఠశాలలుంటాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఒంటి పూట.. 17వ తేదీ నుంచి రెండు పూటలా తరగతులు జరుగుతాయి.