థియేటర్ల నుండి వైదొలగనున్న రంగస్థలం

థియేటర్ల నుండి వైదొలగనున్న రంగస్థలం
రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రం తమిళనాట మంచి వసూళ్లనే రాబడుతోంది. కానీ తమిళనాట నిర్మాతల మండలి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వారాలుగా థియేటర్లను మూసేసి బంద్ సాగిస్తున్న సంగతి తెలిసిందే. దీని మూలాన చాలా తమిళ సినిమాలు విడుదల కాకుండా వాయిదా పడ్డాయి. ఈ తరుణంలో గతవారంమే చెన్నైలోని పలు థియేటర్లలో రంగస్థలం సినిమా విడుదలై మంచి టాక్ తో ముందుకెళ్తోంది. ఇలా తమిళ సినిమాలు విడుదల కాకుండా వేరే సినిమాలు ప్రదర్శించడం నిరసనకు అంత మంచిది కాదని భావించి..తమిళ నిర్మాతల మండలి సభ్యులు తమిళనాట తెలుగు సినిమాల ప్రదర్శనను ఆపాలని తెలుగు నిర్మాతల మండలిని కోరారట. దీనికి మన వారు సానుకూలంగా స్పందించి వచ్చే ఆదివారం నుండి ప్రదర్శనను ఆపుతామని తెలిపారు. దీని మూలాన తమిళ నిర్మాతల బంద్ కి మరింత బలం చేకూరినట్లైంది.