2 మీటర్ల నీళ్ల లోతులో జనావాసాలు

2 మీటర్ల నీళ్ల లోతులో జనావాసాలు

అమెరికా తూర్పుతీరాన్ని ఫ్లోరెన్స్ హరికేన్ తాకింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలతో కరోలినా తీరాన్ని దాటి భూభాగంలోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. ముప్పును గమనించిన వాతావరణ శాఖ అధికారులు ముందుగానే పవర్ కట్ కు ఆదేశించారు. ఫలితంగా లక్షలాది గృహసముదాయాల్లో కరెంటు పోయింది. దీంతో ప్రజలంతా ఇక్కట్లు పడుతున్నారు. ఎమరాల్డ్ ఐజిల్, నార్త్ కరొలినా రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయని, దాదాపు 2 మీటర్ల లోతు నీళ్లలో జనావాసాలు మునిగిపోయాయని తుపాను కేంద్రం తాజాగా రిపోర్టు చేసింది. 

నేషనల్ హరికేన్ సెంటర్ ఈ తెల్లవారుజామునే ప్రజలందరినీ అప్రమత్తం చేసింది. ఫ్లోరెన్స్ తాకిడితో భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే  ణనష్టాన్ని వీలైనంతగా తగ్గించుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముందునుంచే ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. ఎలాంటి సాయమైనా అందించేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని తీర రక్షక దళం ట్వీట్ చేసింది.