ఇంకా దొరకని రోహిత..అసలేమైపోయింది ?

ఇంకా దొరకని రోహిత..అసలేమైపోయింది ?

ఉన్నత చదువులు చదివింది. మొండిగా వుంటుంది. ఎవరేది చెప్పినా పట్టించు కోదు. తన మాటే నెగ్గాలని అనుకుంటుంది. కుటుంబం తప్ప ఇతరులతో ఫ్రెండ్షిప్ లేదు. ఉన్నత చదువులు చదివి గూగుల్ లాంటి సంస్దలో ఉద్యోగం సంపాందింది. ఆ తర్వాత గూగుల్ నుంచి యాపిల్ కంపెనీలో చేరింది. ఇంటి నుంచి ఆఫీస్ దూరం అవుతుందని చెప్పి ఆఫీస్ దగ్గరే ఫ్లాట్ ను తీసుకుని వుంటున్న స్టాప్ వేర్ ఇంజనీర్. ఎంతో ధైర్యంగా వుండే స్టాప్ వెర్ ఇంజనీర్ పన్నెండు రోజుల నుంచి కనిపించ కుండా పోవడం ఇప్పడు హైదరబాద్ లో సంచలనం రేపుతోంది. యాపిల్ కంపెనీలో పని చేస్తున్న రోహిత ఎక్కడికి వెళ్లిందన్న దానిపైన పోలీసులు, కుటుంబ సభ్యులు మల్ల గుల్లాలు పడుతున్న వైనమిది.

అసలు రోహిత ఎక్కడ ? ఏమి చేస్తుంది. పన్నెండు రోజులగా రొహిత ఎమి చేస్తుంది. ఎవరితో కాంటాక్ట్ లేకుండా రోహిత  ఏమి చేస్తుంది ? ఆమె కనపించకుండా పోయి పదిహేడు రొజులు గడుస్తున్నా ఇంకా ఆమె జాడ కుండా పొయింది. 17 రోజుల నుంచి రోహిత ఆచూకిని కనుగొనేందుకు ఎనిమిది టీమ్ లు పనిచేస్తున్నాయి. తన నెల 28 తేదిన గచ్చి బౌలి లోని తన ప్లాట్ నుంచి వెళ్లిపొయిన రోహిత ఆచూకి ఇప్పటికి దొరకలేదు. ఏకంగా ఇరవై మంది కుటుంబ సభ్యులు కలిసి రొహిత ఆచూకి కొసం రెండు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. . ఇదిలా ఉంటే రోహిత మిస్సింగ్‌పై ఆపిల్‌ ఇండియా స్పందించింది. రోహితా తిరిగిరావాలని కోరుకుంటున్నానని ఆపిల్ ఇండియా కంపెనీ తెలిపింది.