రాజకీయ పార్టీల ప్రతినిధులతో రేపు ఎస్ఈసి భేటీ... 

రాజకీయ పార్టీల ప్రతినిధులతో రేపు ఎస్ఈసి భేటీ... 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.  మార్చి 22 నుంచి దేశంలో లాక్ డౌన్ అమలు కావడంతో ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది.  కాగా, ఇప్పుడిప్పుడే కరోనా నుంచి దేశం కోలుకుంటోంది.  కంటైన్మెంట్ జోన్ల మినహా అన్ని ప్రాంతాల్లో జనజీవనం దాదాపుగా సాధారణ స్థితికి చేరుకుంది.  అయితే, నిబంధనలను మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే.  కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెడీ అవుతున్నది.  ఇందులో భాగంగా ఈనెల 28 వ తేదీన రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కాబోతున్నది ఎన్నికల కమిషన్.  రేపు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఎస్ఈసి ఆఫీస్ ఈ భేటీ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిపార్టీల అభిప్రాయం తీసుకోబోతున్నారు.  ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధికి ఆహ్వానం పంపారు.  హాజరైన ప్రతినిధితులతో ఎస్ఈసి విడివిడిగా సమావేశం అవుతుంది.  పార్టీల అభిప్రాయాలను రాతపూర్వకంగా  ఇవ్వాలని పార్టీలను కోరింది.  మరి పార్టీలు ఎలాంటి అభిప్రాయం ఇస్తాయో చూడాలి.